OGతో పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే కానీ.. ఒక్కటి తగ్గింది సుజీత్!

Continues below advertisement

ఓజీ.. వాషియో వాషి.. ఒక్కటే మాట పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే. ఒక కిల్ బిల్, ఒక జాన్ విక్.. ఒక ఒజీ అంతే. అసలు ఈ మూవీ టాలీవుడ్, బాలీవుడ్ కాదు.. హాలీవుడ్ రేంజ్. ఇప్పటివరకు బాలయ్య నరుకుడే చూశాం.. కానీ పవన్ కూడా ఇలా నరకగలడు అని సూజీత్ ప్రూవ్ చేశాడు.
గంభీర అంటే అంటే రక్తపాతం అంతే.. మనోడు ఎక్కడుంటే అక్కడుంటే అక్కడ రక్తం ఏరులై పారాల్సిందే. శవాలు కుప్పలు కుప్పలు పడాల్సిందే. అసలు సెన్సార్ బోర్డ్ వాళ్లు ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారో.. నిజానికి ఆ నరుకుడు చూస్తే.. ఏ+++ ఇవ్వాలి. అలా ఉంటది రక్తపాతం మరి.

పవన్ ఇంట్రో ఫైట్ నుంచి ఫ్యాన్స్‌కి స్టార్ట్ అయిన హై.. క్లైమాక్స్ వరకు అలాగే ఉంటుంది. ఇక ఇంటర్వెల్‌ ఫైట్ ఉంటుంది. గూస్‌బంప్స్ అంతే. అసలు పవన్ కెరీర్లోనే అలాంటి ఫైట్ ఎప్పుడూ చేసుండడు. అలాంటి రక్తపాతం ఉంటుంది ఆ ఫైట్‌లో. ముఖ్యంగా సలార్‌ ఇంటర్వెల్ ఫైట్‌లో హెలికాప్టర్లు వచ్చే టైంలో అందరినీ నరికి జీప్‌పైన నిలబడాడు కదా ప్రభాస్.. ఈ మూవీలో దానికి అప్‌డేటెడ్ వెర్షన్ సీన్ ఉంటుంది.

ఇక బాహుబలిలో భల్లాలదేవ కొడుకు తలని ప్రభాస్ నరికే ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంటుంది కదా..? దానికి కూడా అప్‌డేటెడ్ వెర్షన్ ఉంటుంది ఈ ఫైట్‌లో. అంటే రెండు సూపర్ హిట్ మూవీస్‌లోని ఐకానిక్ ఫైట్ సీన్లకి అప్‌డేటెడ్ వెర్షన్ష్ ఇందులో ఉన్నాయంటే అర్థం చేసుకోండి.. ఈ ఫైట్ ఏ రేంజ్‌లో ఉంటుందో. అసలు ఫస్ట్ ఆఫ్ మొత్తం పవన్ అంటే రక్తపాతం. భయం. విలన్లని వణికించే వాడు. 
ఇక ఈ సినిమా కోసం పవన్ కూడా ప్రాణం పెట్టేశాడు. తనలో ఉన్న కంప్లీట్ యాక్టర్‌ని బయటకి తీశాడు. పోలీస్ స్టేషన్ సీన్లో సైకోలా.. విలనలని నరికే టైంలో రూత్‌లెస్ క్రిమినల్‌లా, ఎమోషనల్ సీన్స్‌లో మనసుకు హత్తుకునేలా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాని భుజాలపై మోశాడు.


అయితే స్టోరీ మనకి తెలిసిందే. జపాన్‌లో సమూరాయ్‌ల దగ్గర ట్రెయిన్ అయిన గంభీర.. అక్కడి యాకూజాలని వణికించి.. సత్యా దాదా.. ప్రకాష్ రాజ్ కోసం ముంబై వస్తాడు. ఇక్కడ సత్య దాదా కోసం పోరాడుతూ అతడి పోర్ట్‌ని, అతడి ఎంపైర్‌ని కాపాడుతుంటాడు. అయితే అనుకోని కారణాలతో ప్రకాష్ రాజ్‌ని వదిలి వెళ్లిపోతాడు. కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత సత్యాదాదా అనుకోని ఆపదలో చిక్కుకోవడంతో మళ్లీ గంభీర వచ్చి కాపాడతాడు. ఆ ప్రయత్నంలో ఓమీని ఎలా ఎదుర్కొన్నాడు? తన కత్తి ఎదురులేదని ఎలా నిరూపించాడు? అదే సినిమా. 
ఇక సినిమాలో మైనస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే.. హీరో క్యారెక్టర్ డిజైన్‌పై పెట్టిన శ్రద్ధలో కనీసం హీరోయిన క్యారెక్టర్‌కి స్టోరీ కూడా రాయలేదు. ప్రకాశ్ రాజ్, శ్రేయా రెడ్డి క్యారెక్టర్స్‌ని ఫస్ట్ హాఫ్‌లో పవర్‌‌ఫుల్‌గా చూపించినా.. సెకండ్ హాఫ్‌లో వాళ్ల క్యారెక్టర్ సైడ్ క్యారెక్టర్లకంటే తక్కువగా ఉంటుంది. 


ఇక అర్జున్ దాస్‌ని క్యారెక్టర్ కంటే వాయిస్‌కే ఎక్కువ వాడుకున్నారు. సినిమాలో పవన్ లైఫ్‌లో వచ్చే మోస్ట్ లో -పాయింట్‌కి, సినిమాలో ఉండే ఒకే ఒక్క ట్విస్ట్‌కి లింక్ ఉండే క్యారెక్టర్ అర్జున్ దాస్‌ది. 


అలాగే సత్యప్రకాశ్, వెంకట్, కిక్ శ్యామ్ లాంటి చాలామంది కనుమరుగైన యాక్టర్స్‌కి మూవీలో మంచి రోల్స్ ఇచ్చాడు. అయితే అజయ్ ఘోష్, యముడు ఫేమ్ రాజేంద్రన్ లాంటి యాక్టర్స్‌ని హైర్ చేసుకుని కూడా ఎందుకు పనికిరాని క్యారెక్టర్స్ ఇచ్చాడు. సినిమాలో పెద్ద మైనస్ స్టోరీ. కేవలం హీరో ఎలివేషన్ మీద శ్రద్ధ పెట్టడంతో.. సినిమా ఫ్యాన్స్‌కి అట్రాక్ట్ చేసేలా స్టోరీని రాసుకోలేకపోయాడు. ఎమోషనల్ సీన్స్ ఏదో ఉండాలి కాబట్టి ఉన్నట్లుంటాయి. అబ్బ ఈ ఎమోషనల్ సీన్ చాలా బాగుంది.. మనసుకు హత్తుకుంది అనే సీన్ ఒక్కటి కూడా ఉండదు.

అదే సినిమాకి పెద్ద మైనస్. ఇంకో మైనస్ పాయింట్.. పవన్ డైలాగ్స్. లోకల్ ఫీల్ ఇవ్వడం కోసం మరాఠీ, జపనీస్‌లో పవన్ కొన్ని డైలాగ్స్ చెప్తాడు పవన్. అయితే ఆ డైలాగ్స్ సగటు తెలుగు ప్రేక్షకుడికి అర్థం కావు. కనీసం వాటికి సబ్‌టైటిల్స్ కూడా వేయలేదు. ముఖ్యగా క్లైమాక్స్‌లో ఓమీకి చెప్పే అతిపెద్ద జపనీస్ డైలాగ్.. దానికి కూడా సబ్‌టైటిల్స్ ఉండవు. ఏంటో  ఫ్యాన్స్‌ని జపనీస్ నేర్చుకుని.. ఆ డైలాగ్‌ని డీకోడ్ చేసుకోమని సుజీత్ చెప్తున్నాడనిపిస్తుంది. 


ఫైనల్‌గా ఒక్కటే మాట.. ఓ ఫ్యాన్‌బాయ్‌గా పవన్‌ని స్క్రీన్‌పై ఎలా చూడాలనుకుంటాడో.. కథని అలాగే రెడీ చేసుకున్నాడు సుజీత్. అందుకే పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం కచ్చితంగా థియేటర్లలో పూనకాలు రావడం గ్యారెంటీ. ఏక్‌దమ్ లైఫ్ టైం సెటిల్‌మెంట్ చేసేశాడు సుజీత్. అయితే పవన్ మీద పెట్టిన శ్రద్ధలో కొద్దిగా స్టోరీపై పెట్టి.. ఒకటి, రెండు ట్విస్ట్‌లు ప్లాన్ చేసుకుని ఉంటే సినిమా కంప్లీట్ ఎక్స్‌పీరియ్స్ ఇచ్చేది. ఇక చాలామంది పవన్ ఫ్యాన్స్‌ని, ప్రభాస్ ఫ్యాన్స్‌ని సస్పెన్స్‌లో పెట్టిన పాయింట్.. ఓజీ సినిమాకి, ప్రభాస్ సాహో మూవీకి లింక్ ఉందా..? అనే పాయింట్. అయితే హ్యాపీ న్యూస్ ఏంటంటే.. కచ్చితంగా ఉంది.

ఓజీ మూవీ సుజీత్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఓ పార్ట్‌గా తీశాడు సుజీత్. సాహోతో లింక్ పెట్టి.. సాహోలో చిన్నప్పటి ప్రభాస్‌ క్యారెక్టర్‌ని కూడా చూపించాడు. దీన్నిబట్టి.. ఓజీ2లో ప్రభాస్ క్యామియో కూడా ఉండొచ్చు. ఇక ఓజీలో ఓమీని అంతం చేసిన ప్రభాస్.. ఓజీ2లో ఏకంగా దావుద్‌ ఇబ్రహీంని రిప్రజెంట్ చేసేలా ఉండే క్యారెక్టర్‌ని, జపాన్ యకూజాలని ఒకేసారి ఎదుర్కోబోతున్నాడు. మరి ఆ సినిమాకి మన డిప్యూటీ సీఎం ఎప్పుడు డేట్స్ ఇస్తాడో.. ఎప్పుడు మూవీ పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏమో. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola