సినిమాపై కన్నడిగులు ఎందుకు కోపంగా ఉన్నారు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన 'పుష్ప పై కన్నడిగులు కారాలు మిరియాలు నూరుతున్నారు. సినిమాను కర్ణాటకలో బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇస్తున్నారు. దీనికి కారణం కర్ణాటకలో కన్నడ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్‌ను ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తుండటమే! తెలుగు వెర్షన్ సుమారు 200 థియేటర్లలో విడుదల అవుతుంటే, కన్నడ వెర్షన్ కేవలం మూడు థియేటర్లలో మాత్రమే విడుదల అవుతోంది. దీనిపై కన్నడ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 'బాయ్ కాట్ పుష్ప ఇన్ కర్ణాటక' హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ ట్రెండ్ స్టార్ట్ చేశారు