బాలకృష్ణ ను చూసేందుకు ఎగబడ్డ అభిమానులు.
అఖండ సినిమా విజయం తో, గుంటూరు పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానానికి అఖండ చిత్ర యూనిట్ వచ్చింది. హీరో బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శీను, ఆలయం లో ప్రత్యేక పూజలు చేసారు. బాలకృష్ణ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సెల్ఫీలు తీసుకొనేందుకు ఎగబడ్డారు. అభిమానులకు అభివాదం చేసి ఆలయంలోకి వెళ్లారు హీరో బాలకృష్ణ.