ధరలు 60 శాతం వరకు తగ్గింపు.. ఏ స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాన్లు బెస్ట్?
నెట్‌ఫ్లిక్స్ తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను భారీగా తగ్గించింది. దీంతో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల ధర రూ.149 నుంచి ప్రారంభం కానుంది. ఏకంగా 60 శాతం వరకు ధరను నెట్‌ఫ్లిక్స్ తగ్గించడం విశేషం. 2016లో మనదేశంలో సేవలు ప్రారంభించిన నాటి నుంచి నెట్‌ఫ్లిక్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి. అమెజాన్ ప్రైమ్ ధరలను పెంచిన వెంటనే నెట్‌ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకోవడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా ఈ సంవత్సరంలోనే ధరలను రివైజ్ చేసింది.