Bala Krishna to play Shankaracharya in next movie : సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడో| ABP Desam

చాలా కాలంగా బాలయ్య 'శంకరాచార్య' పాత్ర పోషించాలనుకుంటున్నారు. హైంధ‌వ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేసిన గొప్ప వ్యక్తి ఆయన.నందమూరి బాలకృష్ణ కేవలం కమర్షియల్ జోనర్ కి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. తన కెరీర్ లో రకరకాల జోనర్లలో నటించారాయన. ఇటీవల విడుదలైన 'అఖండ' సినిమాలో అఘోరా గెటప్ లో జీవించేశారు బాలయ్య. ఆ పాత్రతో దేవాలయాల గొప్పదనాన్ని, హైంధ‌వ ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా.. బాలయ్య క్రేజ్ ను మరింత పెంచింది. ఇదే జోరులో వరుస సినిమాలను సైన్ చేస్తున్నారు బాలయ్య.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola