తన ఫాన్స్ పై లాఠీ ఛార్జ్ గురించి అల్లు అర్జున్ రియాక్షన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో ఫొటోలు దిగుతారనే సమాచారంతో చాలా మంది అభిమానులు గీతా ఆర్ట్స్ ఆఫీసుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ కాదని, ఎన్ కన్వెషన్ సెంటర్ అని తెలియడంతో అక్కడికి వెళ్లారు. చివరకు, బన్నీతో ఫొటోషూట్ క్యాన్సిల్ అని తెలియడంతో అభిమానులకు కోపం వచ్చింది. అద్దాలు పగలగొట్టినట్టు తెలుస్తోంది. దాంతో అభిమానులను అక్కడి నుంచి పంపడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేశారు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ స్పందించారు.