Akhil Akkineni Zainab Grand Reception | గ్రాండ్ గా అఖిల్ అక్కినేని, జైనాబ్ రిసెప్షన్ | ABP Desam
రెండు రోజుల క్రితం వివాహ బంధంతో ఒక్కటైన అక్కినేని అఖిల్, జైనాబ్ ఈ రోజు గ్రాండ్ రిసెప్షన్ ఇస్తున్నారు. పెళ్లిని మాత్రం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే చేసిన అక్కినేని కుటుంబం...రిసెప్షన్ కు మాత్రం సినీ, రాజకీయ ప్రముఖులు అందరికీ ఆహ్వానం పలికింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో కలిసి వచ్చి అఖిల్ ను జైనాబ్ ను ఆశీర్వదించారు. మరో స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరితో వచ్చి అఖిల్, జైనాబ్ లను విష్ చేశారు. అక్కినేని అఖిల్ రిసెప్షన్ సందర్భంగా అక్కినేని కుటుంబం మొత్తం గ్రూప్ ఫోటోలను దిగింది. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు... ప్రముఖ దర్శకుడు సుకుమార్ తబిత, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు కొత్త జంటను ఆశీర్వదించారు. నాగార్జున ఇంట జరిగిన అఖిల్ పెళ్లికి హాజరైన వారిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ఆయన తన సతీమణి ఉపాసనతో కలిసి అఖిల్ రిసెప్షన్ కు వచ్చారు.