Akhanda 2 vs OG Clash | దసరా బరిలో తలపడుతున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ | ABP Desam

Continues below advertisement

 ఈ సారి దసరా పండక్కి మాస్ జాతర ఖాయం. ఆ నవరాత్రులు పండుగ కాదు సినిమా అభిమానులకు అంతకు మించి. ఎందుకంటే సెప్టెంబర్ 25న రెండు భారీ సినిమాలు ఒక దానితో ఒకటి పోటీకి దిగుతున్నాయి. కాబట్టి ఈరోజు అఖండ 2 టీజర్ అప్డేట్ పోస్టర్ వచ్చింది. దానిపైన ఉన్నదేంటంటే సెప్టెంబర్ 25 న అఖండ ఆగమనం అని ఉంది. అఖండతో సూపర్ హిట్ కొట్టిన తర్వాత మళ్లీ బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ 2. అఘోరాల కథతో వస్తున్న బాలయ్య గతంలో మాదిరిగానే మళ్లీ వెండితెరపై గర్జించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత, యాక్టివ్ గా రాజకీయాల్లో కి అడుగు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి మరో సినిమా రాలేదు. హరిహర వీరమల్లు విడుదలకు జాప్యం కావటంతో అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో పక్కన పెడితే OG సినిమాకు భారీ హైప్ ఉంది. సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీరా గా కనిపిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే టీజర్  ఓ రేంజ్ హైప్ ఇచ్చింది. అలాంటి OG రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25 న విడుదల అని మేకర్స్ ముందే ప్రకటించేశారు. అఖండ 2 సినిమాకు 14రీల్స్ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ కాగా...తేజస్విని నందమూరి ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ఓజీ సినిమా ను డీవీవీ దానయ్య నిర్మించారు. ఈరోజుతో పవన్ కళ్యాణ్ తన క్యారెక్టర్ షూట్ ను కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. డబ్బింగ్ ఒక్కటే పెండింగ్ ఉంది. మరి పవన్ కళ్యాణ్ వస్తానంటే బాలయ్య అఖండ 2 పోస్ట్ పోన్ చేసుకుంటారా..లేదా బాలయ్య సినిమాకు గౌరవం ఇచ్చి ప్రొడ్యూసర్ దానయ్య సినిమాను కాస్త వాయిదా వేసుకుంటారా చూడాలి.  రెండు సినిమాలు తగ్గకుండా అదే రిలీజ్ అంటే మాత్రం తెలుగు సినిమాకు చాలా రోజుల తర్వాత కాసుల గలగల మోగటం మాత్రం ఖాయం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola