Shriya Saran: భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ దంపతులు

Continues below advertisement

నటి శ్రియ తిరుపతిలో సందడి చేసింది. తన భర్త ఆండ్రీ కొశ్చేవ్‌, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం (సెప్టెంబరు 14న) తిరుమల చేరుకున్న ఆమె.. శ్రీవారిని దర్శించుకుంది. వీఐపీ దర్శనంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శ్రియ దంపతులకు అర్చుకులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రియ మీడియాతో మాట్లాడింది. 

‘‘ఏటా శ్రీవారిని దర్శించుకుంటాను. కరోనా వైరస్ తర్వాత మొదటిసారి ఇక్కడి వచ్చాం. దాదాపు రెండేళ్లుగా స్వామివారిని దర్శించుకోలేకపోయాను. హిందీ, తెలుగులో మ్యూజిక్ ప్రాజెక్ట్ చేస్తున్నా. రెండు సినిమాలు ఇంకా షూటింగ్ జరుపుకుంటున్నాయి. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్‌’తోపాటు ‘గమనం’ సినిమాలకు వర్క్  చేశాను. తమిళంలో కూడా రెండు సినిమాలు చేస్తున్నాను’’ అని తెలిపింది. 

ఈ సందర్భంగా భర్త ఆండ్రి ఆలయం వద్ద శ్రియ తలపై ముద్దుపెట్టి ప్రేమను వ్యక్తం చేశాడు. టాలీవుడ్‌కు చాలా ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్న శ్రియా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) సినిమాలో అజయ్ దేవగణ్‌కు జోడిగా నటిస్తోంది. ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ ‘గమనం’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram