Siddharth: సినిమా టికెట్స్ వ్యవహారం పై సిద్దార్థ్ సూటి ప్రశ్నలు....
Continues below advertisement
ఓ ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీ ఎంతకు అమ్మాలో ఏసీ రెస్టారెంట్లకు చెప్పరు. కానీ, సినిమా ఇండస్ట్రీతో ఎందుకు సమస్య? - ట్విట్టర్ వేదికగా హీరో సిద్దార్థ్ సూటి ప్రశ్న. ఈ కౌంటర్ ఏపీ సర్కార్ కా? సినిమా, సినిమా హాళ్లు బతకడానికి అవకాశం ఇవ్వమని హీరో సిద్ధార్థ్ (Siddharth) ట్విట్టర్ వేదికగా కోరారు. గురువారం ఆయన సినిమా టికెట్ రేట్స్ గురించి పలు ట్వీట్లు చేశారు. ప్రభుత్వాలకు అంటూ పేర్కొన్నప్పటికీ... ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన ఆయా ట్వీట్లు చేశారని మెజారిటీ జనాల అభిప్రాయం. "మీరు ఓ ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీ ఎంతకు అమ్మాలో ఏసీ రెస్టారెంట్లకు చెప్పరు. కానీ, సినిమా ఇండస్ట్రీనే ఎప్పుడూ ఎందుకు సమస్యాత్మక పరిశ్రమగా ప్రభుత్వాలు చూస్తున్నాయి? వాళ్ల పెట్టుబడి ఎలా తిరిగి రాబట్టుకోవాలో ఎందుకు చెబుతున్నారు?" అని సిద్ధార్థ్ ప్రశ్నించారు.
Continues below advertisement