తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం
తిరుమల శ్రీవారిని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం.. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయం వెలుపలకు వచ్చిన బ్రహ్మానందాన్ని చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు.