BIGG BOSS Telugu OTT:నో కామా-నో ఫుల్ స్టాప్-నాన్ స్టాప్ గా బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది.| ABP Desam
Bigg Boss షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో మొత్తం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇప్పుడు కొత్తగా Bigg Boss Telugu OTT వెర్షన్ ను మొదలుపెట్టబోతున్నారు. Disney Hotstar ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ అవుతుంది. 24/7 ఈ షో హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్. ఇందులో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, నాగార్జున కలిసి నటించారు. ఫన్నీగా ప్రోమోను డిజైన్ చేశారు. చివర్లో Nagarjuna.. 'నో కామా, నో ఫుల్ స్టాప్, ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది నాన్ స్టాప్' అంటూ డైలాగ్ చెప్పారు.ఫిబ్రవరి 26 నుంచి షో మొదలుకానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు