Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఆరంభంలోనే తీవ్ర వివాదాస్పదంగా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు తీవ్ర అవమానానికి గురయ్యాడంటూ నెటిజన్లు జడ్జెస్ తీరుపై విరుచుకుపడుతున్నారు.

ఉప్పల్ బాలును ఉద్దేశించి జడ్జ్ నవదీప్ "నీలాంటి వారిని బిగ్ బాస్‌కు పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి? నీ వీడియోలు వల్గర్‌గా ఉంటాయి కదా?" అని వ్యాఖ్యానించగా, బిందు మాధవి "మీరు ట్రాన్స్ జెండరా?" అని ప్రశ్నించారు. వేదికపై కనీసం ఒక్క టాస్క్ కూడా ఇచ్చే అవకాశం ఇవ్వకుండానే, ముగ్గురు జడ్జెస్ అతనికి రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేశారు.

ఈ ఘటనపై ఉప్పల్ బాలు ఇన్ స్టాగ్రామ్ లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. "నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. అక్కడ ఉన్న అందరికీ టాస్కులు ఇచ్చి నన్ను మాత్రం పిలిచి అవమానించారు. తోటి జడ్జ్ అభిజీత్ నాకు గ్రీన్ కార్డ్ ఇవ్వబోతుంటే నవదీప్ అడ్డుకుని నా అవకాశం పాడుచేశారు" అంటూ ఆవేదన చెందారు. ఆడిషన్స్ పేరుతో కంటెస్టెంట్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ హర్ట్ చేస్తున్నారని, అగ్నిపరీక్షలో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు జడ్జెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ బాలుకు మద్దతుగా ట్రోలింగ్ తో హోరెత్తిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola