Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, గత ప్రేమకథ, ఇండస్ట్రీలో తనకు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ నెట్టింట తీవ్ర వైరల్ అవుతున్నాయి.
తాను బాధలో ఉన్న సమయంలో తనకు అండగా నిలిచే ఇద్దరు హీరోల గురించి అనుపమ ప్రత్యేకంగా చెప్పారు. "నేను డల్‌గా ఉన్న ప్రతిసారీ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నుంచి మెసేజ్ వస్తుంది. నేను బాధలో ఉన్న విషయం ఆయనకు ఎలా తెలుస్తుందో అని ఆశ్చర్యపోతాను. దుల్కర్‌తో మాట్లాడితే నా బాధంతా మాయమవుతుంది. ఆయన తర్వాత నేను ఇండస్ట్రీలో అంతగా నమ్మే మరో వ్యక్తి టాలీవుడ్ హీరో రామ్ పోతినేని" అని తెలిపారు.
తన గత టాక్సిక్ రిలేషన్ షిప్, బ్రేకప్ గురించి కూడా అనుపమ ఓపెన్ అయ్యారు. తన మాజీ ప్రియుడి నుంచి ఎదుర్కొన్న మానసిక వేధింపులను గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందారు. ఆ బంధంలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం భయం, ఆందోళనతో గడిపానని, స్నేహితులకు కూడా దూరమయ్యానని చెప్పారు.