Bigboss : నాగార్జునకు కూడా 'బిగ్ బాస్' విన్నర్ గురించి ప్రశ్న
బిగ్ బాస్'... 'బిగ్ బాస్'... 'బిగ్ బాస్'... షో చివరకు వచ్చేయడంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో దీని ఫీవర్ ఎక్కువ ఉంది. హౌస్‌లో షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతు, సన్నీ, శ్రీ రామచంద్ర, మానస్ నాగులపల్లి ఉన్నారు. ఈ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలుస్తారు? - ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న ఇదే. విజేత ఎవరో తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి ఉంది. అందుకే, కింగ్ అక్కినేని నాగార్జునకు కూడా 'బిగ్ బాస్' విన్నర్ గురించి ప్రశ్న ఎదురైంది.