Balakrishna Next Movie with Marco Director | NBK112 | 'మార్కో' దర్శకుడితో బాలయ్య సినిమా?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఎంతో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' చేస్తున్న ఆయన... రెండు కొత్త సినిమాలకు ఒకే చెప్పారు. ఆ రెండు కాకుండా మరొక రెండు సినిమాలు లైన్‌లో ఉన్నట్లు తెలిసింది. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ మహమ్మద్ హనీఫ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఈ దర్శకుడు ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. అది కూడా బాలకృష్ణ సినిమాతో అని ఫిలిం నగర్ లో ఒక వార్త కూడా చక్కర్లు కొడుతోంది. మార్కో హిట్ తర్వాత మహమ్మద్ హనీఫ్  తో సినిమాలు తీసేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపుతున్నారు. 'దిల్' రాజు ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని బాలకృష్ణకు ఆయన ఒక కథ చెప్పారని, వాళ్ళిద్దరి మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. 

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే అందులో యాక్షన్ ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోండి. బాలకృష్ణ, మహమ్మద్ హనీఫ్ కాంబినేషన్‌లో రూపొందే సినిమాను 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేస్తారా? లేదంటే మరొక నిర్మాత ఎవరైనా చేస్తారా? అనేది చూడాలి. 'అఖండ 2' తర్వాత 'జైలర్ 2'లో బాలకృష్ణ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. బాలకృష్ణ పుట్టిన రోజుకు ముందు ఆ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అది NBK111 అని పేర్కొన్నారు. ఆ సినిమా తర్వాత 'మార్కో' ఫేమ్ హనీఫ్ సినిమా ఉండొచ్చని తెలుస్తుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola