Akhil Akkineni, Zainab Ravdjee Reception | అఖిల్ జైనాబ్ రిసెప్షన్ లో స్టార్స్ సందడి

Continues below advertisement

కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న అఖిల్ అక్కినేని  జైనాబ్ ఈ నెల 6వ తేదీన తమ ఇంట్లోనే పెళ్లి చేసుకున్నారు. నాగార్జున ఇంటిలో కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరిగింది. అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ అఖిల్ వివాహానికి హాజరు అయ్యారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

పెళ్లిని మాత్రం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే చేసిన అక్కినేని కుటుంబం...రిసెప్షన్ కు మాత్రం సినీ, రాజకీయ ప్రముఖులు అందరికీ ఆహ్వానం పలికింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో వచ్చారు స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి, అల్లరి నరేష్ , నాని, హీరో నిఖిల్, అడవి శేష్ ఇలా టాలీవుడ్ నుండే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీ నుండి సెలెబ్రెటీస్ సందడి చేసారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణ రావు , నిర్మాత టి సుబ్బరామి రెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రిసెప్షన్ కి హాజరై అఖిల్ జైనాబ్ కు తమ బెస్ట్ విషెస్ ని తెలిపారు. అక్కినేని కుటుంబం గ్రూప్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola