దేవర చెన్నై ప్రెస్ మీట్లో అనిరుథ్ రవిచందర్ స్పీచ్!
పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘దేవర: పార్ట్ 1’. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్లను వేగవంతం చేశారు. చెన్నైలో ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు. 'దేవర' చిత్రానికి తమిళ సంచలనం, యువ సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చెన్నైలో విలేకరుల సమావేశానికి అనిరుథ్ రవిచందర్ కూడా వచ్చేశారు. ఊరికే రావడమే కాకుండా స్టేజి మీద పాట పాడి వచ్చిన వారిని అందరినీ అలరించారు. ఆ తరువాత తాను దేవర: పార్ట్ 1 సినిమాలోకి ఎలా వచ్చిందీ వివరించారు. 'జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న విషయం బయటకి రాగానే... జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేనే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండాలని ట్రెండ్ చేశారు. అలా దేవర ప్రపంచంతో నా ప్రయాణం మొదలు అయింది. నాకు హైదరాబాదు నగరంలో ఉన్న సన్నిహిత మిత్రుడు ఎన్టీఆర్ అన్న' అని అనిరుద్ తెలిపారు.