Anchor Anasuya: తాగుబోతు పాత్రలతో మహిళలను ఎందుకు కించపరుస్తారు... సీనియర్ నటుణ్ని నిలదీసిన అనసూయ
ట్విట్టర్ వేదికగా ఓ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలకు సమాధానమంటూ యాంకర్ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఇంటర్వ్యూ లో కోట శ్రీనివాసరావ్ అనసూయ డ్రెస్‌పై వ్యాఖ్యలు చేయడం వలన అనసూయ ట్విటర్ వేదికగా తన సమాధానాన్ని వ్యక్తం చేసింది. వస్త్రధారణ అనేది వ్యక్తిగత విషయమన్న అనసూయ.. కొన్నిసార్లు వృత్తిపరమైన ఛాయిస్ అని చెప్పింది. ప్రశ్నించిన సీనియర్ నటుడు తాగుబోతు పాత్రలు వేసి...మహిళలను సినిమాల్లో ఎందుకు కించపరిచే పాత్రలు చేశారంటూ ప్రశ్నించింది అనసూయ.