Akkineni Fans Dharna : రగులుతున్న బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యల వివాదం | DNN | ABP Desam
నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని నాగేశ్వరరావు పై చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా రేగుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అభిమానులు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేశారు. ఎన్టీఆర్ కంటే ముందే అక్కినేని నాగేశ్వరరావు హీరో అయ్యారంటున్న అక్కినేని అభిమానులు...బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరకపోతే ఆందోళనలు ఆపమంటూ హెచ్చరించారు.