Delhi:దిల్లీలో ఘనంగా 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలు
దిల్లీలో 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమంలో పాల్గొని సినీకళాకారులను పురస్కారాలతో సత్కరించారు.అగ్ర కథానాయకుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు విశిష్ట పురస్కారం వరించింది. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు ఆయనకు లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించింది.
Tags :
Delhi Rajinikanth Nationalfilmawards Talaiva 67nationalfilmawards Venkaihnaidu Dadasahebfalke