YS Jagan Will Come To Assembly or Not | వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా? | ABP Desam

Continues below advertisement

ఏపీలో ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని పోలీసులు నిస్తేజమయ్యారని  ఆపద్ధర్మ సీఎం జగన్ ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతల్ని గవర్నర్ వద్దకు పంపించి ఫిర్యాదులు కూడా చేశారు. నిజానికి ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ సీఎంగా ఆయనే ఉన్నారు. అయినా ఆయన ఆరోపణలు చేయడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. నిజానికి కేర్ టేకర్ సీఎంగా ఉంటే.. కొన్ని విషయాల్లో మినహా పవర్ మామూలుగా సీఎంగా ఉన్నట్లే ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, సీఎం రెండు సందర్భాల్లో ఆపద్ధర్మ సీఎంగా మారాల్సి ఉంది. అందులో మొదటిది ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు.. రెండోది తాను రాజీనామా చేసినప్పుడు.. తర్వాత ప్రభత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మ సీఎంగా ఉండటం. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి జగన్ ఆపద్ధర్మ సీఎంగానే ఉన్నారు. కానీ పవర్స్ లో మాత్రం తేడాలు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే సీఎం  ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అంటే..దాదాపు పాలన అంతా.. అంతర్గతంగా జరిగిపోవాలి కానీ.. పబ్లిసిటీ రాకూడదు.  కొత్త అసెంబ్లీలు, పార్లమెంట్ ఏర్పాటు అయిందని రాష్ట్రపతి, గవర్నర్లకు ఈసీ నివేదికలు సమర్పించిన తర్వాత ఈసీ కోడ్ ను ఎత్తివేస్తుంది. అప్పటి వరకూ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది. ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు.  ఇప్పుడు కోడ్ కూడా ఎత్తివేశారు. చంద్రబాబు ఇంకా ప్రమాణ స్వీకారం  చేయలేదు. అందకే జగన్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతున్నారు. కోడ్ లేకపోయినా ఆపద్ధర్మ సీఎంగా ఉన్నారంటే... ఆయనకు పూర్తి స్థాయి అధికారాలు ఉన్నట్లే. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram