KA Paul Fires on Chandrababu Naidu | చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డ కేఏ పాల్ | ABP Desam

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై పంజాగుట్టలో చీటింగ్ కేసు నమోదయింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి కేఏ పాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎల్బీనగర్ టిక్కెట్ ఇస్తామని చెప్పి రూ. యాభై లక్షలు తీసుకున్నారని కానీ టిక్కెట్ ఇవ్వలేదని ఆయన తెలిపారు. రూ. 30 లక్షలు ఆన్ లైన్‌లో.. రూ. 20 లక్షలు నగదు ద్వారా చెల్లించానని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరమ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గత ఏడాది నవంబర్‌లోనే ముగిశాయి. ఆ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయలేదు. ఆయన  పార్టీ ఇన్  యాక్టివ్ గా మారడంతో.. ఈసీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. కామన్ సింబల్ ఇవ్వాలంటూ కేఏ పాల్  రచ్చ చేశారు. అయితే చివరికి ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టలేదు. ఇటీవలి ఎన్నికల్లో వరంగల్ నుంచి బాబూమోహన్ పోటీ చేస్తారని ఆయన ప్రకటించినప్పటికీ.. చివరికి బాబూమోహన్ కూడా.. హ్యాండిచ్చారు.               

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola