YS Jagan resign as CM | ఓటమి ఖరారు కావటంతో రాజీనామా ఆలోచనలో జగన్

Continues below advertisement

వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజినామా చేయనున్నారు. ఆయన కాసేపట్లో గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రం ఇచ్చే అవకాశం ఉంది. వైసీపీకి ఈ సారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేకుండా పోయే అవకాశం కనిపిస్తోంది.రెండో సారి అధికారంలోకి రావాలనుకున్న జగన్..అన్ని ప్రయత్నాలు చేశారు.కానీ... పాలన గురించి పట్టించుకోకుండా పూర్తిగా బటన్లు నొక్కి అప్పులు చేసి పంచడం మీదే్ దృష్టి కేంద్రీకరించడంతో ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. ఈ ఫలితం వైసీపీ పెద్దలందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ని మించి కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పంధా కొనసాగితే ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో వైకాపా సాధించిన 151 స్థానాల మార్క్ ను కూటమి దాటేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మంత్రుల ఇలాఖాలో ప్రతికూల ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. 

పులివెందులలో సీఎం జగన్, చీపురు పల్లిలో బొత్స సత్యనారాయణ, పుంగనూరులో పెద్దిరెోడ్డి రామచంద్రారెడ్డి, సర్వేపల్లిలో కాకాణి గోవర్థన్ రెడ్డి  మినహా మంత్రులంతా ఓట్ల లెక్కింపులో భారీగా వెనకబడ్డారు. కాకాణి, బొత్స, పెద్దిరెడ్డి సైతం కొన్ని రౌండ్లలో స్వల్ప తేడాతో వెనకంజ వేయడం కనిపిస్తోంది. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram