TDP JSP Alliance Leading in AP Assembly Elections | 150 సీట్ల దిశగా కూటమి

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కూటమి విజృంభించింది. ఆక్కడా ఇక్కడా అని తేడా లేదు. ఏ నియోజకవర్గం చూసిన అదే ఫలితం. కూటమి కూటమి కూటమే. ముఖ్యమైన నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ మొదటి రౌండ్‌ నుంచి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడా ప్రత్యర్థికి ఛాన్స్ఇవ్వకుండా దూసుకెళ్తున్నారు.

పిఠాపురంలో రౌండ్ రౌండ్‌కు పవన్ మెజార్టీ పెంచుకుంటూపోతున్నారు. రెండు చోట్ల ఓడిపోయాడు... తిరిగి రాడు అనుకున్నారు అంతా. పడి లేచిన  కెరటంలా దూసుకొచ్చారు. పిఠాపురంలో తిరుగులేని విజయం దిశగా పవన్ గాలి వీస్తోంది. ఈసారి అసెంబ్లీలో పవన్ కల్యాణ్ అడుగు పెట్టడం ఖాయమైంది.

కూటమి దెబ్బకు ఫ్యాన్ విలవిల్లాడుతోంది. దాదాపు 150 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతోంది కూటమి. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకుని..భారీ భద్రత కల్పించే దిశగా ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు....

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola