T-Congress Spokesperson Kalva Sujatha Interview | బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో చెప్పిన టీ కాంగ్రెస్

Continues below advertisement

బీఆర్ఎస్ ఓటమి వెనుక కారణాలేంటో ఏబీపీ దేశానికి వివరించారు టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత.

తెలంగాణలో కేసీఆర్ పని ఖతమైందా..? నిజంగా బీఆర్ఎస్ దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి ఉందా..! అంటే లోక్ సభ ఎన్నికలు ఎన్నికల ఫలితాలు చూస్తే అదే డౌట్ వస్తుంది.  తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా..బీఆర్ఎస్ ఒక్కటి అంటే ఒక్కటి కూడా గెలవలేకపోయింది. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్, హరీశ్ రావు సిద్దిపేటలు మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. కానీ, ఆ సీటు కూడా కేసీఆర్ గెలుచుకోలేకపోయారు. దీనికి గల కారణం ఒక్కటే.  

అదేంటంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు రెండు రకాలుగా పడుతుంది. ఒకటి.. ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ అభ్యర్థి డమ్మీ క్యాండిడేట్ ఐనా జనాలు పెద్దగా పట్టించుకోరు.  ఇంకోకటి.. ఏ పార్టీ అధికారంలోకి ఉండదో అప్పుడు జనాలు పార్టీ సింబల్ కంటే అభ్యర్థి ముఖాన్నే చూస్తారు.  అందుకే అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు పెద్దగా ఎవరికి తెలియకపోయినా..రేవంత్ రెడ్డి మేనియాతో 8 సీట్ల వరకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి బలమైన అభ్యర్థుల్ని పెట్టాలి కానీ అలా చేయలేదు. సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ మినహాయిస్తే పెద్దగా చరిష్మా ఉన్న లీడర్లను బరిలో నిలబెట్టలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ ఎంపీగా నిలబెట్టినప్పటికీ.. ఇన్నాళ్లు యాంటీ కేసీఆర్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కారు ఎక్కడం జనాలకు నచ్చలేదు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram