Chandrababu Naidu Family Winning Celebrations | AP Elections Counting | గెలుపు సంబరాల్లో చంద్రబాబు

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం దిశగా సాగుతోంది. దీంతో.. చంద్రబాబు ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులంతా కూటమి విజయోత్సవాల్లో మునిగిపోయారు

 

రాజధాని ప్రాంతంలో కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని 21 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలని నమోదు చేశారు. కృష్ణా జిల్లాలోని పామర్రు, గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, పెనమలూరు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఈ జిల్లాలోని అవనిగడ్డలో జనసేన పోటీ చేయగా, ఆ పార్టీ అభ్యర్థి ఘన విజయాన్ని నమోదు చేశారు. అలాగే, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. ఈ జిల్లాలో విజయవాడ వెస్ట్ నుంచి బిజెపి అభ్యర్థి విజయం సాధించగా, మిగిలిన స్థానాల్లో టిడిపి అభ్యర్థులు విజయాన్ని నమోదు చేశారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని నమోదు చేశారు. తెనాలి నుంచి జనసేన విజయం సాధించగా, మిగిలిన స్థానాల్లో టిడిపి అభ్యర్థులు విజయాన్ని నమోదు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola