Pawan Kalyan Lead In Pithapuram | జగన్ ఓటమిని ఖాయం చేసిన ఓ అర్ధరాత్రి..!

Continues below advertisement

యుద్ధానికి ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ... తక్షణ కారణం ఒకటి ఉంటుంది. అదే యుద్ధం గమ్యం, గమనాన్ని నిర్దేశిస్తుంది. దశ, దిశను మార్చేస్తుంది. అలా.. ఏపీ ఎన్నికల్లో జగన్ కు చంద్రబాబుకు మధ్య యుద్ధ వాతవారణాన్ని మొత్తం మార్చేసింది ఆ రాత్రి..!

2023 సెప్టెంబర్ 10.. చంద్రబాబును అరెస్ట్ చేసి 24 గంటలు గడుస్తోంది. యావత్ రాష్ట్రం సైలెంట్ ఐపోయింది. టీడీపీ శ్రేణులు నిరుత్సాహంలో పడిపోయారు. యాంటీ జగన్ వర్గం ఆందోళనలో పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరారు పవన్ కల్యాణ్. ఆ వార్త బయటికి రాగానే ఏపీ అంతా ఉత్కంఠ వాతావరణం. చంద్రబాబు అరెస్ట్ సమయంలో  పవన్ కల్యాణ్ ఏపీలో అడుగుపెడితే ఏమవుతుందో జగన్ కు తెలుసు. అందుకే ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లోనే పవన్ ను ఆపడానికి ప్లాన్ వేశారు. అనుకున్నట్లుగానే సరిహద్దుల్లోకి రాగానే ఆపేశారు. ఇంకేముంది అది అర్ధరాత్రి..జనసేనాని చుట్టు పెద్దగా జనం ఉండరు. తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతారు అనుకున్నారు. కానీ, జనసైనికులు జగన్ వ్యూహాన్ని తిప్పికొట్టారు. పవన్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం....పడుకున్న జనసైనికులను నిద్రలేపి జనసేనాని కవచంలా మారేలా చేసింది. పవన్ కల్యాణ్ ను పోలీసులు ఆపిన గంటలోనే దాదాపు లక్ష మందికిపైగా రోడ్డుపైకి చేరుకున్నారు. నడిరోడ్డుపై పవన్ కల్యాణ్ పడుకున్నారు తప్పా... అడుగు వెనక్కి వేయలేదు. ఆ రోజు చంద్రబాబు జైలుకు వెళ్లారు అన్నదానికంటే....పవన్ కల్యాణ్ ను ఆపడమే జగన్ చేసిన పెద్ద తప్పులా మారింది. కొడితే... పవన్ కల్యాణ్ దర్జగా ఏపీలోకి అడుగుపెట్టారు. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram