Mega Family Grand Welcome To Pawan Kalyan | మెగాస్టార్ ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్

ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు మొత్తం మెగా ఫ్యామిలీ ఘనస్వాగతం పలికారు. కుటుంబం మొత్తం ఒకే చోట చేరి పవన్ కళ్యాణ్ విజయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ విక్టరిలో మెగా కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలుతుంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి భారీ మెజారిటీ విజయం సాధించారు. వైసీపీ నేత వంగా గీతాపై ఆయన 69 వేల ఓట్ల తేడాది ఘన విజయం సాధించారు. గెలుపు అనంతరం తొలిసారి పవన్‌ తన అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి వెళ్లారు. తన కుమారుడు అకిరా నందన్‌, భార్య అన్నా లెజ్నెవాతో సహా చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్‌కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది.

గెలుపుతో వచ్చిన కుమారుడికి అంజనమ్మ గుమ్మడికాయ దిష్టి తిసింది. వదిన సురేఖ హారతి ఇచ్చిన ఆహ్వానించింది. అనంతరం భావోద్వేగంతో తల్లిని అప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం అన్నయ్య చిరంజీవి కాళ్లపై పడి పవన్‌ కళ్యాణ్‌ ఎమోషనల్‌ అయ్యారు. అన్నయ్యకు కాళ్లకు నమస్కారం చెప్పి.. ఆ తర్వాత తల్లి అంజనమ్మ, వదిన సురేఖ కాళ్లకు కూడా నమస్కారం తెలిపారు. ప్రస్తుతం బావోద్వేగంతో  ఈ వీడియో మెగా ఫ్యాన్స్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఇక అన్నదమ్ముల అప్యాయతను చూసి మెగా అభిమానుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola