Gouthu Sirisha | Palasa | 5 ఏళ్ల జగన్ అక్రమాలకు అడ్డుకట్ట పడిందంటున్న గౌతు శిరీష

తన ఐదేళ్ల పాలనలో జగన్ నోటి తో మాట్లాడటం కంటే డబ్బుతో మాట్లాడటానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.

తన ఐదేళ్ల పాలనలో జగన్ నోటి తో మాట్లాడటం కంటే డబ్బుతో మాట్లాడటానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. సామాన్యులను సంక్షేమ పథకాలతో శ్రీమంతులను చేస్తామంటూ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు..అప్పులు తెచ్చి పంచిన డబ్బులు అరకొరా బతుకుల్ని మార్చేయామే కానీ డబ్బుతో ఓట్లు రాబట్టాలనే ఆయన ఆశలను నీరుగార్చాయి. మరో వైపు ప్రగతిని పూర్తిగా వదిలేశారు. గతుకుల్లో రోడ్లు వెతుక్కోవాలి తప్ప కనీసం సౌకర్యాలు లేని రాష్ట్రంలా ఏపీని మార్చేయటం..యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లటం..ఉద్యోగాలు ఇవ్వమంటే వాలంటీర్లు ఉద్యోగాలే పెద్ద ఉద్యోగాలన్నట్లు చేసిన హడావిడి ఇవన్నీ జగన్ ఓటమికి కారణాలుగా మారాయి.లాస్ట్ టైమ్ ఎన్నికల్లో ఎంత మేండేట్ తమకు ఇచ్చారు ప్రజలని వైసీపీ సంబరపడిందో ఇప్పుడు అంతకు మించిన మేండేట్ ను కూటమికి అప్పగించి డబ్బులు పంచితే చాలు ప్రజలు గొర్రెల్లా ఓటేస్తారనే కురచ ఆలోచనలను చాచి పెట్టి కొట్టినట్లైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola