Chandrababu Emotional | అసెంబ్లీలో అవమానిస్తే...అంతులేని యుద్ధాన్నిచ్చాడు

నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజూ చేయని పని ఆ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేశారు. తన వయస్సు, పెద్దరికం, హుందాతనం అన్నీ పక్కన పెట్టి చిన్న పిల్లాడిలా గుక్కపట్టి ఏడ్చారు. అది కూడా ప్రెస్ మీట్ లో మీడియా అందరి ముందూ. ఎప్పుడూ చూడని చంద్రబాబు ను అలా చూసే సరికి మీడియాకు కూడా షాక్. కారణం తన భార్యను అసెంబ్లీలో ఘోరంగా అవమానించారని.

సీన్ కట్ చేస్తే పరిస్థితులు అనేక రకాలుగా మారాయి. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని పరిస్థితులను చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసి 53రోజులు జైలు జీవితం గడిపేలా చేశారు. కానీ 74 ఏళ్ల ఈ రాజకీయ దురంధరుడు అన్ని అడ్డంకులనూ దాటుకొచ్చారు. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే క్లైమోర్ మైన్స్ మీద పడితే లేచి నిలబడి చొక్కా దులిపి పదండీ రాజకీయం చేద్దామన్నాడు. సంక్షేమ పథకాలతో విచ్చలవిడిగా ధనప్రవాహం చేస్తున్న అధికార పక్షాన్ని ఎదురొడ్డి నిలబడి ఈ రోజు విజయం సాధించాడు. గుక్క పట్టి ఏడ్చిన రోజు నుంచి గుద్ది పారేసే రోజూ వరకూ చంద్రబాబు సాగించిన జర్నీ ఓ ఇన్ స్పిరేషన్. తనను నమ్ముకున్న కార్యకర్తలు ఎక్కడా నిరుత్సాహానికి లోను కాకుండా మండే ఎండల్లో 50 డిగ్రీల పైబడిన టెంపరేచర్ లో తడిసిన చొక్కాతో ఉత్సాహంగా తిరిగేస్తూ ఈ రోజు కూటమిని అధికారంలోకి తీసుకువచ్చాడు. రోజుకు ఐదారు సభల్లో అనర్గళంగా మాట్లేడేస్తూ అధికారంలో ఉన్న వైసీపీని ఏకి పారేశాడు. ఇవన్నీ కలగలిసి ఈ రోజు ఎవరూ ఊహించని స్థాయి విజయాన్ని అందుకుంది కూటమి. అధికార వైసీపీ ని కూకటివేళ్లతో సహా పీకి పారేసి దేవుడు రాసిన స్క్రిప్టును షిక్కటి చిరునవ్వుతో రీ రైట్ చేశారు నారా చంద్రబాబునాయుడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola