Ayyanna Patrudu on Elections Results 2024 | అరాచకాలు సృష్టించిన వైసీపీ నాయకులను వదిలిపెట్టబోం

ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించాక... టీడీపీ సీనియర్ లీడర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వైసీపీ నేతలను, వాళ్లకు సహకరించిన అధికారులను వదలిపెట్టబోమని హెచ్చరించారు.

 

తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో గత ఐదేళ్లలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం తర్వాత బుధవారం నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విజయం చారిత్రాత్మకమని.. ఇంత హిస్టారికల్ విక్టరీ ఎప్పుడూ చూడలేదని అన్నారు. 'గత ప్రభుత్వ హయాంలో మాట్లాడే హక్కు, స్వేచ్ఛ కోల్పోయే పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేశారో చూశాం. ఎన్ని త్యాగాలు చేసైనా భావి తరాల భవిష్యత్ కోసం ముందుకెళ్లాం. విచ్చలవిడితనం, అహంకారంతో ఏం చేస్తామన్నా ప్రజలు క్షమించరు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు పక్క ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఓట్లేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులను గెలిపించిన వారందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తాం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola