BJP Lost in Ayodhya | Faizabad Election Results |రాముడు వేరు-రాజకీయం వేరు అన్నట్లుగా తీర్ప
అయోధ్యలో రామ మందిర నిర్మాణం..! 2 సీట్లు ఉన్న బీజేపీ..ఈ స్థాయిలో ఉండటానికి ఇదే డ్రైవింగ్ ఫోర్స్. కానీ, గుడి కట్టిన తరువాత మాత్రం సీన్ రివర్స్ ఐంది. నిన్న విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో అయోధ్య రామ మందిరం కొలువై ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానంలో మాత్రం బీజేపీ ఓడిపోయింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ విజయం సాధించారు. అది ఆషామాషీ విజయం కాదు..50 వేలకుపైగా మెజార్టీ వచ్చింది ఎస్పీ అభ్యర్థి. ఇప్పుడు ఈ వార్తే దేశవ్యాప్తంగా అనేక చర్చలకు దారి తీస్తుంది..!
దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామనే నినాదంతో ఎన్నికలకు వెళ్తూ రాజకీయంగా ఎదిగింది బీజేపీ. అయితే, ఇప్పుడు రామమందిర నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ అంశం బీజేపీకి రాజకీయంగా లబ్ధి కలిగించలేదు. మందిర నిర్మాణం తమకు రాజకీయంగా లాభం చేకూరుస్తుందని బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. నిజానికి, రామమందిర నిర్మాణం మొత్తం పూర్తి కాకముందే ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించారనే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఐనప్పటికీ.. దేశమంతా హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు మందిర నిర్మాణాన్ని ఎన్నికల ప్రచార అంశంగా మార్చుకుంది. అయితే, దేశవ్యాప్తంగా బీజేపీ సీట్లు తగ్గిపోవడం చూస్తే రామమందిర నిర్మాణం ద్వారా బీజేపీ ఆశించిన రాజకీయ ప్రయోజనం ఆ పార్టీకి దక్కనట్టు స్పష్టమవుతున్నది. అంటే.. రాముడిని రాజకీయంగా వాడుకుంటున్నారు బీజేపీ వాళ్లు అనే ఫిలింగ్ లోకి ఓటర్లు వచ్చారేమోనని ఈ తీర్పు చూస్తే డౌట్ వస్తుంది.