SaroorNagar:రాత్రి వేళల్లో ఇళ్లు దొరికితే వదలడు.. అంతా బెట్టింగ్స్..
Continues below advertisement
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న భారీ దొంగతనం జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన పాత నేరస్థుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాత్రుళ్లు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు గఫార్ ఖాన్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కేజీ 805 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1,90,000 నగదు, ఒక బైక్, 10 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మొత్తం రూ.93,62,500 విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇతడు ఇప్పటికే 27 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని తెలిపారు.
Continues below advertisement