Visakha Pharma: విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఇద్దరు కార్మికుల మృతి

విశాఖ జిల్లా పరవాడ లోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దుర్గాప్రసాద్, మణికంఠ అనే కార్మికులు నైట్ షిఫ్ట్ లో పంప్ హౌస్ లోని వాల్ ఓపెన్ చేయటంతో విషవాయువు వెలువడింది.దీంతో ఇద్దరూ అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు .మృతి చెందిన వారిలో ఒకరు తుని ప్రాంతానికి చెందిన వారు కాగా మరొకరు పాయకరావుపేట సీతారాంపురం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు.పరవాడ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola