Shilpa Chowdary : శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి
Continues below advertisement
శిల్పా చౌదరి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు డబ్బులు ఇచ్చిన ఒక్కొక్కరూ పోలీస్ స్టేషన్‌లో కేసు పెడుతున్నారు. తాజాగా మహేష్ బాబు సోదరి కూడా ఆమెకు డబ్బులు ఇచ్చినట్టు వెల్లడైంది. శిల్పా చౌదరి, కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నవంబర్ నెలాఖరున వీరిపై ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాళ్లకు డబ్బులు ఇచ్చిన వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమకు ఎంత రావాలో చెప్పి ఫిర్యాదు చేస్తున్నారు.
Continues below advertisement