East Godavari News: ఆక్సిజన్ సిలిండర్లు పేలి ప్రమాదం... తుక్కు తుక్కైన టాటా వ్యాన్

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మెడపాడులో మూడు రోజుల క్రితం వ్యాన్ లో ఆక్సిజన్ సిలిండర్లు పేలి ప్రమాదం సంభవించింది. వ్యాన్ లో తరలిస్తున్న ఆక్సిజన్ సిలిండర్లు లీకై ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో టాటా వ్యాన్ వెనుక భాగం తుక్కు తుక్కైంది. వ్యాన్ పక్కన బైక్ పై ప్రయాణిస్తోన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని 108లో ఆసుపత్రికి తరలించారు. తాజాగా సీసీటీవీ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola