Indian Digital Currency: క్రిప్టో కరెన్సీ కి పోటీగా డిజిటల్ కరెన్సీ

Continues below advertisement

క్రిప్టో కరెన్సీకి కౌంటర్‌ లా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత్ కు ప్రత్యేకంగా ఉండేలా క్రిప్టో కరెన్సీని తీసుకొస్తున్నట్టు బడ్జెట్‌లో పెట్టింది. ఇండియన్ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్నట్టు పేర్కొంది. దీన్ని త్వరలోనే RBI విడుదల చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ‘‘బ్లాక్‌చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రూపాయిని జారీ చేస్తాం. 2022-23 నుంచే ఆర్బీఐ ఈ డిజిటల్ కరెన్సీని జారీ చేస్తుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరింతగా ఊపునిస్తుందని ఆశిస్తున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram