Ysrcp Vs Janasena: విజయవాడలో వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ | DNN |ABP Desam
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ,జనసేన నేతలకు మద్య వాగ్వాదం జరిగింది. గడప, గడప కు కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు జనసేన కార్యాలయం ముందుకు వెళ్లారు. అక్కడ జనసేన నేత పోతిన మహేష్ కు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయల చెక్కును అందించేందుకు వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి ప్రయత్నించారు. అయితే మహేష్ చెక్కును తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఇరు వర్గాల మద్య మాటల యుద్దం నడిచింది. ఆ తరువాత ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.