Amaravati Farmers Protest : తెనాలిలో రైతుల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు | DNN | ABP Desam
అమరావతి రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెనాలిలో ఐతానగర్ వైపు పాదయాత్రగా వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని చెప్పటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలతో యాత్ర చేస్తున్నామన్న రైతులు...పోలీసులు అడ్డుగా బారికేడ్లు పెట్టడంతో వాటిని తోసేసేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత నెలకొంది.