Polavaram: పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని గుర్తించండి: వైసీపీ ఎంపీలు
పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని మరోసారి అభ్యర్థించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలను ఆమోదించాలని డిమాండ్ చేశారు. సవరించిన అంచనాలు ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని కేంద్రానికి మరోసారి గుర్తు చేశారు వైసీపీ ఎంపీలు. ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. ఈ విషయాన్ని మర్చిపోయి కేంద్రం ప్రవర్తిస్తోందని ఆరోపించారు ఎంపీలు. 55 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉందని... రాష్ట్ర ప్రభుత్వం 2వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింద్నారు.