YS Jagan on EVM Tamperings: సంచలన ట్వీట్ తో అధికార పక్షానికి దొరికిపోయిన మాజీ సీఎం జగన్

YS Jagan on EVM Tamperings: 2019లో ఎన్నికలు గెలిచినప్పుడు ఈవీఎంల పనితీరును వెనుకేసుకొచ్చిన జగన్ ఇప్పుడు మాట ఎందుకు మార్చారు. NDA కూటమి నేతలు జగన్ ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు..ఈ వీడియోలో చూడండి.

ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై తెలుగుశం పార్టీ మండిపడింది. ఈవీఎంలు అద్భుతంగా పని చేస్తాయని వాటిలో లోపాల్లేవని ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఆ పార్టీ నేతలుకూడా ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.  గతంలో ఈవీఎంలను సమర్థిస్తూ  జగన్ మాట్లాడిన వీడియోను కూడా లోకేష్ పోస్ట్ చేశారు. 

జగన్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి కూడా విమర్శలు గుప్పించారు.   ఏపీఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడు..గెలిస్తే తన గొప్ప..ఓడితే ఈవీఎంల తప్పా..? 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలి.. పరనింద..ఆత్మ స్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola