Ambati Rambabu on Polavaram project | పోలవరం ప్రాజెక్టు తనకు అర్థం కాలేదన్న అంబటి రాంబాబు | ABP

Continues below advertisement

Ambati Rambabu sensational on Polavaram Project | అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవరం సందర్శించారు. ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని, తిరిగి దారిలోకి తెచ్చి, పోలవరం పూర్తి చేయాలంటే మరో నాలుగు సీజన్లు పడుతుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ నీటిపారుదలశాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవం ప్రాజెక్ట్ చాలా కాంప్లికేటెడ్ విషయం, దాని గురించి ఎవరికి అర్థం కాదన్నారు. ఎందుకంటే పోలవరం తనకు కూడా అర్థం కాలేదు అన్నారు అంబటి రాంబాబు.

పోలవరం ప్రాజెక్టును పలుమార్లు సందర్శించి, సంబంధిత శాఖ అధికారులతో ఎన్నోసార్లు సుదీర్ఘంగా చర్చలు జరిపిన తరువాత ఓ విషయం అర్థమైందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే ప్రాజెక్టు కాదని చెప్పిన తొలి వ్యక్తిని తానేనని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారని, ఇందులో కొత్తదనం ఏముందని ఏపీ ప్రభుత్వాన్ని, టీడీపీ నేతలను ప్రశ్నించారు. 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగానే పోలవరం నేటికి పూర్తి కావడం లేదని మరో సంచలనానికి తెరలేపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram