YCP, TDP Fight over Power Cuts in Andhra Pradesh: కర్రలతో కొట్టుకున్న వైసీపీ,టీడీపీ నాయకులు
Andhra Pradesh లో విద్యుత్ ఛార్జీలు, పవర్ కట్స్ రాజకీయంగానూ వేడి పుట్టిస్తోంది. Guntur జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో YCP, TDP నాయకుల మధ్య మాటామాటా పెరిగి దాడుల వరకు వెళ్లింది. ఇరువర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.