YCP MLA Rachamallu Sivaprasad Reddy Falls: కర్రసాము చేస్తూ కిందపడ్డ ఎమ్మెల్యే రాచమల్లు

వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి.... నిన్న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ప్రొద్దుటూరులో జరిగిన సంబరాల్లో..... స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కర్రసాము చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడ్డారు. వెంటనే కార్యకర్తల సాయంతో పైకి లేచారు. పెద్ద గాయమేం కాలేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola