World Suicide Prevention Day : ఏపీ పోలీస్ ర్యాలీలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి | DNN | ABP Desam

కుటుంబ కలహాలతోనే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..అయితే బలవన్మరణాలకు పాల్పడటం సమస్యలకు సమాధానం కాదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్, సైకియాట్రిక్ సొసైటి ఆద్వర్యంలో బెంజిసర్కిల్ నుండి ఇందిరాగాంధి స్టేడియం వరుకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన ఏపీ డీజీపీ చదువుల విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దని డీజీపీ సూచించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు... అనారోగ్య సమస్యలతో మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola