AP CM Jagan | జగన్ గురించి అంతన్నారు, ఇంతన్నారు. ఇప్పుడేమంటారు. | ABP Desam
కోనసీమలో గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్ లో గత జగన్ ను చూశామని లంక గ్రామాల ప్రజలతోపాటు అపార్టీ నాయకులు తెగ మురిసి పోతున్నారు.. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ముందు రోజున పోలీసులు నానా హడావిడి సృష్టించారు.. కోనసీమ వ్యాప్తంగా ఎక్కడక్కడే ఆంక్షలు విధించారు పోలీసులు. పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో హెలీక్యాప్టర్ దిగిన వెంటనే స్థానిక నాయకులతో మమేకమైన సీఎం అక్కడ నుంచి కనిపించిన ప్రతీ ఒక్కరినీ పలుకరిస్తూ అవ్వలు, అక్కలు ఇలా అందరినీ తల నిమురుతూ చిన్నారులను ముద్దాడుతూ చంకనెత్తుకుని ఇలా పాదయాత్రలో కనిపించిన జగన్ ను చూసి ఆపార్టీ శ్రేణులు చాలా సంబరపడిపోయారు.