West Godavari News: కాయ కష్టం కళ్ల ముందే దగ్ధం... మంటల్లో కాలిపోయిన రూ.20 లక్షలు
పిడుగుపాటుకి రూ.20 లక్షలు దగ్ధమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం పశ్చిమగోదావరి జిల్లా గురుభట్లగూడెంలో కాళ్ల కృష్ణవేణి, ఆమె కుమారుడు ఇంట్లో ఉండగా పక్కనే ఉన్న గడ్డివాము నుంచి మంటలు అంటుకున్నాయి. గడ్డివాముపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. బాధితులు అప్రమత్తమై బయటకు వచ్చారు. ఇటీవలే భూమిని అమ్మగా వచ్చిన రూ.20 లక్షల నగదు, బంగారం మంటల్లో పూర్తిగా కాలిపోయిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.