విషాదం తో నిండిపోయిన జంగారెడ్డి గూడెం బస్సు ప్రమాద ప్రాంతం
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో జల్లేరువాగులో ఆర్టీసి బస్సు బోల్తా పడటంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. లారీ ని తప్పించబోయి అదుపుతప్పి బస్సు వాగు లో పడిపోయింది.గాయాలైన వారిని స్దానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటన స్థలానికి ఆర్డీవో లక్ష్మీప్రసన్న ,జంగారెడ్డిగూడెం డీఎస్పీ చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ చిన్నారావుతో సహా తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరి పరిస్ధితి విషమంగా ఉండటం బాధాకరమని గవర్నర్ పేర్కొన్నారు.