పేదల ఇళ్లు తొలగించడం ఎజెండాగా పెట్టుకొని పని చేస్తున్నారన్న నారా లోకేష్

గుంటూరు జిల్లా,కురగల్లు లో పేదల ఇల్లు తొలగింపుకు నోటిసులు ఇవ్వటానికి నిరసిస్తూ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద స్దానికులు నిరసనకు దిగారు.ఆందోళ‌న చేస్తున్న వారికి టీడీపీ నేత నారా లోకేష్ సంఘీభావం తెలిపారు.రాజధాని ప్రాంతంలో పేదలు ఇళ్లు తొలగింపు లక్ష్యంగా అధికార పార్టీ పనిచేస్తుంది,నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పేదల ఇళ్లు తొలగించడం ఎజెండాగా పెట్టుకొని పని చేస్తున్నట్టు ఉంద‌ని లోకేష్ మండిప‌డ్డారు.సిఆర్డీఎ పరిధిలో పేదలు ఇళ్లు తొలగింపుకు నోటిసు ఇచ్చే అధికారం స్థానిక రెవెన్యూ అధికారులు కు లేదని లోకేష్ తెలిపారు.ఇసుక అమ్మ‌కాలు చేస్తూ స్దానిక ఎమ్మెల్యే అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.పేద‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola